నీట్ పీజీ - 2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
NEET PG Exam 2022: వాయిదాతో గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతుందన్న సుప్రీంకోర్టు
NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. నీట్ PG- 2021 కౌన్సిలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.
అయితే పరీక్షకు సిద్ధమైన 2 లక్షల మంది అభ్యర్థులతో పాటు రోగులకు చికిత్సపై కూడా ప్రభావం పడుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే మే 21న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.