SSC Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్.. 30 ఏళ్లవారు కూడా అర్హులే..!
SSC Recruitment 2023: నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి.
SSC Recruitment 2023: నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికింద కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టులని భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు 5369
ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత అయి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 27 మార్చి 2023 వరకు సమయం కేటాయించారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్ మార్గాల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులందరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.