ఎస్సెస్సీ ఎంటీఎస్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. 11,000 వేల ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

SSC MTS Exam 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-01-20 05:57 GMT

ఎస్సెస్సీ ఎంటీఎస్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. 11,000 వేల ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

SSC MTS Exam 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎస్సెస్సీ 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 18 జనవరి 2023 నుంచి ప్రారంభమైనందున అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ను (ssc.nic.in.) సందర్శించాలి.

ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17 ఫిబ్రవరి 2023. ఈ తేదీ తర్వాత అప్లికేషన్ లింక్ మూసివేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 11,000 కంటే ఎక్కువ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో దాదాపు 10,880 పోస్టులు ఎంటీఎస్‌కు, 529 పోస్టులు హవిల్దార్‌కు సంబంధించినవి. వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును చెక్‌ చేయవచ్చు.

రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం పరీక్ష ఏప్రిల్ 2023 నెలలో నిర్వహిస్తామని సమాచారం అందించారు. అయితే ఇందులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 02.01.1998 కంటే ముందు అలాగే 1.1.2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇది MTS, CBICలో హవల్దార్ పోస్ట్ కోసం. అదే సమయంలో CBIC హవల్దార్ పోస్టుకు వయోపరిమితిని 18 నుంచి 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.

Tags:    

Similar News