SSC GD Constable 2024: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ క్లాస్‌తో పోలీస్ కొలువు అస్సలు మిస్ చేయొద్దు..!
SSC GD Constable 2024: నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. పదో తరగతితో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించే అవకాశం వచ్చింది.
SSC GD Constable 2024: నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. పదో తరగతితో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించే అవకాశం వచ్చింది. గతంలో తెలంగాణ, ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లై చేసి నిరాశ చెందిన అభ్యర్థులకు ఇదొక వరంగా చెప్పాలి. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు. ఇప్పటికే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నవంబర్ 24, 2023న SSC GD కానిస్టేబుల్ 2024 నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2023గా నిర్ణయించారు. ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి చివరి తేదీ జనవరి 1, 2024. ఇది కాకుండా దరఖాస్తు ఫారమ్‌లో తప్పులు సరిచేయడానికి జనవరి 4, జనవరి 6 న అవకాశం కల్పిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2024 ఫిబ్రవరి-మార్చిలో నిర్వహిస్తారు.
ఈ రిక్రూట్‌మెంట్ కింద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బల్ (SSB), ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SSF)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), అస్సాం రైఫిల్స్ (AR)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) కోసం మొత్తం 26,146 ఖాళీలు భర్తీ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి..?
1. ముందుగా SSC ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. తర్వాత SSC కానిస్టేబుల్ GD పరీక్ష 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
4. తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపాలి. దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఓకె బటన్‌పై క్లిక్ చేయాలి.
5. ఫారమ్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.