SSC CPO 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 4187 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు..!
SSC CPO 2024 Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)
SSC CPO 2024 Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో 4187 సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC CPO 2024 నోటిఫికేషన్ మార్చి 4, 2024న విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4 నుంచి మార్చి 28, 2024 వరకు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు
అభ్యర్థి వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. వయస్సు ఆగస్టు 1, 2024 నుంచి లెక్కిస్తారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు 5 సంవత్సరాలు, OBC వర్గానికి 3 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఇది కాకుండా వివిధ కేటగిరీల కింద ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇస్తారు.
అర్హతలు
అన్ని పోస్టులకు అర్హత సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే పురుష అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT) కోసం షెడ్యూల్ చేసిన తేదీలో LMV (మోటార్ సైకిల్, కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
SSC CPO 2024 పరీక్షకు అప్లికేషన్ ఫీజు రుసుము రూ.100 చెల్లించాలి. అయితే, SC, ST, మాజీ సైనికులకు చెందిన మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందుతారు.
ఈ విధంగా అప్లై చేయండి..
1. ముందుగా ssc.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. పేరు, ఈ మెయిల్, మొబైల్ నంబర్ వంటి బేసిక్ వివరాలను నింపి SSC వెబ్‌సైట్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలి.
3. తర్వాత మీ రిజిస్టర్డ్ వివరాలతో అకౌంట్‌కు లాగిన్‌కావాలి.
4. వ్యక్తిగత, విద్యాపరమైన, ఇతర ముఖ్యమైన వివరాలతో అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
5. అవసరమైన పత్రాల ఫొటోగ్రాఫ్, సంతకం, స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
6. అభ్యర్థులు ఫీజు చెల్లించి ఫారమ్‌ను సమర్పించి దాని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.