Jee Main 2022: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా
Jee Main 2022: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా
Jee Main 2022: రెండో విడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-JEEను NTA వాయిదా వేసింది. వాస్తవానికి పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా..ఈనెల 25నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA బుధవారం ప్రకటించింది. అయితే ఎగ్జామ్ వాయిదాకు కారణాలను మాత్రం తెలుపలేదు. JEE సెకండ్ సెషన్‌కు 6.25 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానుండగా సుమారు 500 నగరాల్లో పరీక్షా కేంద్రాలను NTA ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇదిలా ఉండగా JEE తొలి సెషన్ ఎగ్జామ్ జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించారు. ఈనెల 12న ఫలితాలను కూడా ప్రకటించారు.