SBI Clerk 2023 Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. ఎస్బీఐలో 8283 క్లర్క్ ఉద్యోగాలు..!
SBI Clerk 2023 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 16న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI Clerk 2023 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 16న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 8773 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)గా చేరాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ను చెక్ చేసి 17 నవంబర్ నుంచి 07 డిసెంబర్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బెంగళూరు, అహ్మదాబాద్, అమరావతి, భోపాల్, భువనేశ్వర్, బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కేరళ, జైపూర్, కోల్‌కతా, లక్నో / ఢిల్లీ, మహారాష్ట్ర / ముంబై మెట్రో, పాట్నా, తిరువనంతపురం మరియు వివిధ ప్రదేశాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. రిక్రూట్‌మెంట్ ఆల్ ఇండియా ప్రాతిపదికన జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రౌండ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు, మెయిన్స్‌లో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష వ్యవధి 1 గంట, మెయిన్స్ పరీక్ష 2 గంటల 40 నిమిషాల సమయం కేటాయిస్తారు.
SBI క్లర్క్ 2023 అర్హత ప్రమాణాలు
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొంది ఉండాలి. అభ్యర్థికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.19900 చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్‌లకు రూ. 17900 వేతనంలో రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు కలిపి మొత్తం రూ.19900 చెల్లిస్తారు. అడ్మిట్ కార్డ్ పరీక్షకు ఒక వారం ముందు విడుదల చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు వివరాలను ఉపయోగించి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ అందుబాటులో ఉంటుంది.