నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!
SBI CBO Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్ ఆఫీసర్ (CBO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ అంటే sbi.co.inలో 18 అక్టోబర్ నుంచి 07 నవంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 04 డిసెంబర్ 2022న ఆన్‌లైన్ పరీక్షకు హాజరుకావలసి ఉంటుంది. భారతదేశంలోని అనేక కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీని గురంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా దాదాపు 1422 ఖాళీలని భర్తీ చేస్తారు. వీటిలో గరిష్టంగా ఈశాన్య ప్రాంతంలో 300 ఖాళీలు ఉన్నాయి. తర్వాత జైపూర్, మహారాష్ట్రలో 200 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అర్హత, వయోపరిమితి తదితర విషయాలు తెలుసుకోవాలి.
అభ్యర్థుల వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. విద్యార్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD)తో సహా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ పరీక్ష - ఆన్‌లైన్ పరీక్షలో 120 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష, 50 మార్కులకు సబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది.
స్క్రీనింగ్ - ఆన్‌లైన్ పరీక్షలో పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులు, పత్రాలు స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది.
ఇంటర్వ్యూ - 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.