ఫలితాలు ప్రకటించిన UPSC.. మెరిసిన తెలుగు తేజాలు

2023 ఏడాదికి గాను సివిల్స్ కు 1,016 మంది ఎంపిక

Update: 2024-04-16 14:26 GMT

UPSC: ఫలితాలు ప్రకటించిన UPSC.. మెరిసిన తెలుగు తేజాలు 

UPSC: 2023 UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం వెయ్యి 16 మందిని ఎంపిక చేశారు. ఇందులో IASకు 180, IPSకు 200, IFSకు 37, మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్ లో 113 మందిని ఎంపిక చేసినట్టు UPSC ప్రకటించింది. ఆలిండియా మొదటి ర్యాంక్ ఆదిత్య శ్రీవాస్తవా సాధించగా.. రెండో స్థానంలో అనిమేష్ ప్రధాన్ నిలిచారు.

సివిల్స్‌లో 50 మందికి పైగా తెలుగు తేజాలు సత్తా చాటారు. మహబూబ్‌నగర్ జిల్లా పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరి అనన్య రెడ్డి ఆలిండియా మూడో ర్యాంక్ సాధించారు. కరీంనగర్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ ఆలిండియా 27 వ ర్యాంక్‌లో నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా చందాటికి గ్రామానికి చెందిన ఆరె విశాల్ 718, ర్యాంక్ సాధించారు. కాగా.. విశాల్ తండ్రి మంచిర్యాల ఏసీపీగా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ టౌన్ కు చెందిన జయసింహారెడ్డి 103 ర్యాంక్, గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568 ర్యాంక్, శివనగర్‌కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంకులు సాధించారు.

Tags:    

Similar News