Bank Jobs 2023: బ్యాంకు జాబులలో ది బెస్ట్‌ జాబ్‌.. లక్ష కంటే ఎక్కువ జీతం.. అస్సలు మిస్సవ్వొద్దు..!

Bank Jobs 2023: బ్యాంకు జాబుల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.

Update: 2023-05-15 10:14 GMT

Bank Jobs 2023: బ్యాంకు జాబులలో ది బెస్ట్‌ జాబ్‌.. లక్ష కంటే ఎక్కువ జీతం.. అస్సలు మిస్సవ్వొద్దు..!

Bank Jobs 2023: బ్యాంకు జాబుల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే బ్యాంకులన్నింటిలోకి పెద్ద బ్యాంకు అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండి రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగం పొందాలనుకుంటే ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు. ఆర్బీఐలో గ్రేడ్ B స్థాయి మొత్తం 291 పోస్టులని భర్తీ చేస్తుంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో ప్రారంభమైంది. అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అప్లై చేసుకునే ముందు ఒక్కసారి వెబ్‌సైట్‌ను సందర్శించడం మరిచిపోవద్దు.

అర్హత

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆర్బీఐ గ్రేడ్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. మే 01, 2023 వరకు వయస్సు 21 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అదే సమయంలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే రిజర్వేషన్‌ పరిధిలోకి వచ్చే వారికి వయో సడలింపు ఉంటుందని గుర్తుంచుకోండి. ఇందుకోసం నోటిఫికేషన్‌ పూర్తిగా చదవండి.

జీతం వివరాలు

ఆర్‌బీఐలో ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ ఉద్యోగాలు 222 ఉన్నాయి. ఇది కాకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్‌లో డిఇపిఆర్ 38 పోస్టులని భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా డీఎస్‌ఐఎం కోసం 31 పోస్టులను కేటాయించారు. ఇందులో రెండు దశల రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. సెలక్ట్‌ అయిన అభ్యర్థులకు బేసిక్‌ వేతనంగా రూ.55,200 చెల్లిస్తారు. అన్ని కలుపుకొని రూ.1,16,914 వరకు జీతం పొందవచ్చు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు RBI రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. (rbi.org.in.) 09 జూన్ 2023 చివరితేదీగా నిర్ణయించారు. చివరి తేదీ తర్వాత అప్లికేషన్ లింక్ వెబ్‌సైట్ నుంచి తీసివేస్తారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News