Railway Jobs 2023: టెన్త్‌, ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. రైల్వేలో లోకోపైలట్‌ ఉద్యోగాలు..!

Railway Jobs 2023: రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలు కనే నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు.

Update: 2023-04-03 13:30 GMT

Railway Jobs 2023: టెన్త్‌, ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. రైల్వేలో లోకోపైలట్‌ ఉద్యోగాలు..!

Railway Jobs 2023: రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలు కనే నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకంటే నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు అర్హులవుతారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి మే 6, 2023 వరకు ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcjaipur.in లేదా nwr.indianrailways.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 238 ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీకి 120, ఓబీసీకి 36, ఎస్టీకి 18, ఎస్సీకి 36 పోస్టులు రిజర్వు చేశారు. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో పాటు అభ్యర్థి ఫిట్టర్ మొదలైన ట్రేడ్‌లో ఐటీఐ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదే సమయంలో OBC కేటగిరీకి వయోపరిమితి 45 సంవత్సరాలు, SC, ST వర్గాలకు 47 సంవత్సరాలుగా నిర్ణయించారు.

దరఖాస్తు రుసుము

అన్ని కేటగిరీల అభ్యర్థులని దరఖాస్తు రుసుము నుంచి మినహాయించారు. అంటే ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులని CBT పరీక్ష ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్‌కు పిలుస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrcjaipur.in ని సందర్శించాలి.

2. తర్వాత New Registration పై క్లిక్ చేయండి.

3. మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా నమోదు చేసుకోండి.

4. ఇప్పుడు అప్లికేషన్‌ను ప్రారంభించి, అభ్యర్థించిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి.

5. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పిస్తే సరిపోతుంది.

Tags:    

Similar News