ONGC Recruitment 2023: పది, ఇంటర్‌ పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ONGCలో అప్రెంటిస్‌ పోస్టులు..!

ONGC Recruitment 2023: పది, ఇంటర్‌ పాసైన వారికి శుభవార్తని చెప్పాలి.

Update: 2023-09-14 15:30 GMT

ONGC Recruitment 2023: పది, ఇంటర్‌ పాసైన వారికి గుడ్‌న్యూస్‌.. ONGCలో అప్రెంటిస్‌ పోస్టులు..!

ONGC Recruitment 2023: పది, ఇంటర్‌ పాసైన వారికి శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) 2,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని (ongcindia.co) సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు 1 సెప్టెంబర్ 2023 నుంచి 20 సెప్టెంబర్ 2023 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫలితాలు 5 అక్టోబర్ 2023న విడుదల అవుతాయి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు 20 సెప్టెంబర్ 2023 నాటికి లెక్కలోకి తీసుకుంటారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో వేర్వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు నిర్దేశించారు. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

BSC, BBA డిగ్రీ హోల్డర్లు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే బీటెక్ ఉన్నవారు కూడా ఈ పోస్టులకి అర్హులే. అలాగే 12వ తరగతి ఉత్తీర్ణులు, డిప్లొమా హోల్డర్లు డిప్లొమా అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటీస్ కోసం 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకి ఎలాంటి పరీక్ష ఉండదు. అకాడమిక్‌ పరీక్షల్లో వచ్చిన పర్సంటేజి ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ ఉంటుంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

స్టైఫండ్

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులు నెలకు రూ.9000 జీతం అందుతుంది.

డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులు నెలకు రూ. 8000 జీతం అందుతుంది.

ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థికి నెలవారీ జీతం రూ.7000 అందుతుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి

1. అభ్యర్థులు ముందుగా ongcindia.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. తర్వాత ఫోటో, పత్రాలు, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.

4. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఫారమ్‌ పూర్తిచేయాలి.

5. చివరగా రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Tags:    

Similar News