Post Office Jobs 2023: పోస్టాఫీసు ఉద్యోగాలకి అప్లై చేశారా.. రేపే చివరితేదీ..!
Post Office Jobs 2023: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతకు ఇది చివరి అవకాశం.
Post Office Jobs 2023: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతకు ఇది చివరి అవకాశం. ఈ నోటిఫికేషన్ కింద పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టుల భర్తీ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు రేపటిలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్‌లు BPM, ABPM, డాక్ సేవక్ పోస్టుల భర్తీ జరుగుతుంది. పోస్ట్‌ల శాఖలో మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కిల్‌లో గరిష్టంగా 7,987 ఖాళీలు, తర్వాత తమిళనాడులో 3,167, కర్ణాటకలో 3,036, ఆంధ్రప్రదేశ్‌లో 2,480 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేదీ
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2023. దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా లోపం ఉంటే 17 నుంచి 19 ఫిబ్రవరి 2023 వరకు దిద్దుబాటు చేసుకోవచ్చు.
వయోపరిమితి
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత
దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి బోర్డు పరీక్షలో గణితం, ఇంగ్లీషు తప్పనిసరి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. మహిళలు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు, SC, ST కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
1.ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inకి వెళ్లాలి.
2.ఇక్కడ తగిన వివరాలతో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవాలి.
3.తర్వాత దరఖాస్తు ప్రక్రియను కొనసాగించి ఫారమ్‌ను నింపాలి.
4.ఇప్పుడు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించాలి.
5.దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి డౌన్‌లోడ్ చేయాలి.
6.తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.