ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైతే జీతం ఎంత.. అలవెన్స్‌ ఇతర ప్రయోజనాలు తెలుసుకోండి..!

Delhi Police Constable Recruitment 2023: ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషేన్‌ విడుదల చేసింది.

Update: 2023-09-15 08:17 GMT

ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైతే జీతం ఎంత.. అలవెన్స్‌ ఇతర ప్రయోజనాలు తెలుసుకోండి..!

Delhi Police Constable Recruitment 2023: ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషేన్‌ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి సెప్టెంబర్ 30 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత పరీక్షకు హాజరుకావలసి ఉంటుంది. అయితే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైతే జీతం ఎంత.. అలవెన్స్‌లు, గ్రేడ్‌ పే గురించి చాలామందికి తెలియదు. ఈ రోజు ఈ వివరాల గురించి తెలుసుకుందాం.

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జీతం

7వ పే కమిషన్ ప్రకారం ఢిల్లీ పోలీసుల ప్రారంభ జీతం రూ. 40,000 నుంచి రూ.43,000 మధ్య ఉంటుంది. బేసిక్ పే రూ. 21,700గా, గ్రేడ్ పే రూ.2000గా నిర్ణయించారు. ప్రారంభ వార్షిక వేతనం రూ.4.80 లక్షల నుంచి రూ.5.16 లక్షల వరకు ఉంటుంది. ఇందులో HRA, DA, మెడికల్ మొదలైనవి కలిసి ఉంటాయి.

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ గ్రేడ్ పే రూ. 2000

బేసిక్‌ సాలరీ రూ.21,700

ఇంటి అద్దె భత్యం రూ. 5208

డియర్నెస్ అలవెన్స్ రూ. 6076

రేషన్ చెల్లింపు రూ. 3636

ప్రయాణ భత్యం రూ. 4212

నెలకు మొత్తం జీతం రూ. 40,842

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ ప్రొఫైల్

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు కానిస్టేబుల్ పాత్రలు, బాధ్యతల గురించి తెలుసుకోవాలి. FIR నమోదు చేయడం అతి ముఖ్యమైన పని. తర్వాత నేర కార్యకలాపాలను నిరోధించడానికి, అత్యవసర పరిస్థితులలో స్పందించడం, వారికి కేటాయించిన ప్రాంతాలలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ చేయడం ఉంటాయి. సంఘటనలు, నిరసనల సమయంలో జనాలను నియంత్రించడం, ప్రజల భద్రతను కాపాడటం వంటి పనులు చేయాలి. కేసులను పరిష్కరించడంలో, దర్యాప్తు చేయడంలో సీనియర్‌ అధికారులకి సహాయం చేయాల్సి ఉంటుంది. నేరాలకు సంబంధించిన రికార్డులను మెయింటెన్‌ చేయడం, నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది.

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోషన్‌లు

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన వ్యక్తి నిర్దిష్ట వ్యవధి తర్వాత కెరీర్ రికార్డు, ఆచరణాత్మక ప్రవర్తన, పనితీరు ఆధారంగా ప్రమోషన్‌ పొందుతారు. కెరీర్‌లో ఉన్నత హోదాను పొందడమే కాకుండా వారి జీతం దాదాపు 20 శాతం పెరుగుతుంది. వారి ప్రమోషన్‌లు ఈ విధంగా ఉంటాయి.

1. కానిస్టేబుల్

2. హెడ్ కానిస్టేబుల్

3. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్

4. సబ్ ఇన్స్పెక్టర్

5. ఇన్స్పెక్టర్

6. ACP

7. DCP

Tags:    

Similar News