Indian Navy and Indian Coast Guard: ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్ మధ్య తేడాలేంటి.. జాబ్‌ ప్రొఫైల్‌, జీతం గురించి తెలుసుకోండి..!

Indian Navy and Indian Coast Guard: భారతదేశం సముద్ర రక్షణ దళాలుగా ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ పనిచేస్తాయి.

Update: 2024-02-02 14:00 GMT

Indian Navy and Indian Coast Guard: ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్ మధ్య తేడాలేంటి.. జాబ్‌ ప్రొఫైల్‌, జీతం గురించి తెలుసుకోండి..!

Indian Navy and Indian Coast Guard: భారతదేశం సముద్ర రక్షణ దళాలుగా ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ పనిచేస్తాయి. సముద్ర భద్రత కోసం రెండు దళాలు పనిచేసినప్పటికీ రెండు సంస్థలకు వేర్వేరు బాధ్యతలు, నియామక ప్రక్రియలు, అర్హత ప్రమాణాలు ఉంటాయి. కానీ చాలామంది ఈ రెండు సైన్యాలు ఒకటే అని భావిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించలేరు. ఈ రోజు ఆ తేడా గురించి తెలుసుకుందాం.

ఇండియన్ కోస్ట్ గార్డ్

ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధానంగా సముద్ర చట్ట అమలు, పరిశోధన, రెస్క్యూ ఏజెన్సీ పనులు చేస్తుంది. సముద్ర చట్టాలను అమలు చేయడం, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడం, రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడం, తీరప్రాంతాల్లో గస్తీకాయడం చేస్తుంది. మత్స్యకారులు, నావికులకు సహాయం చేయడం, రక్షించడంతోపాటు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధిస్తుంది. 1978 కోస్ట్ గార్డ్ చట్టం ద్వారా దీని కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో చేరడానికి ఇష్టపడే అభ్యర్థులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్, మెకానికల్, అసిస్టెంట్ కమాండెంట్‌తో సహా వివిధ పోస్టులు అందుబాటులో ఉంటాయి. కనీస అర్హత ప్రమాణాలకు సాధారణంగా 10వ తరగతి అర్హత అవసరం. అయితే ఆఫీసర్ పోస్టులకు సంబంధిత స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి.

జీతం గురించి మాట్లాడితే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో వేర్వేరు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వేర్వేరు జీతాలను పొందుతారు. ఉదాహరణకు అసిస్టెంట్ కమాండెంట్ రూ. 15,600 నుంచి రూ. 39,100 వరకు జీతం ఆశించవచ్చు. అయితే డైరెక్టర్ జనరల్ వంటి ఉన్నత స్థాయి అధికారులు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు జీతం పొందుతారు.

ఇండియన్ నేవీ

భారత నౌకాదళం త్రివిధ దళాలలో ఒకటి. సముద్రంలో భద్రతను నిర్వహించడం, పెద్దపెద్ద ముప్పులను నివారించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. భారతీయ నావికాదళం 1957 నావికా చట్టం ప్రకారం పనిచేస్తుంది. ఇండియన్ నేవీ వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలను అందిస్తుంది. ఇందులో ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ రిక్రూట్‌మెంట్, SSR రిక్రూట్‌మెంట్, ట్రేడ్స్‌మ్యాన్, MR పరీక్ష ఉంటాయి. ఇండియన్ నేవీలో చేరడానికి విద్యార్హతలకు సాధారణంగా ఫిజిక్స్, మ్యాథ్స్‌తో 10+2 ఉండాలి. ఆఫీసర్ కేడర్ పోస్టులకు సంబంధిత స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అవసరం. ఇండియన్ నేవీలో చేరడానికి వయోపరిమితి సాధారణంగా 16 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది.

ఇండియన్ నేవీలో ఎంపికైన అభ్యర్థులు పోటీ వేతన స్కేల్ పొందుతారు. ఉదాహరణకు సబ్ లెఫ్టినెంట్ రూ. 56,100 నుంచి రూ. 1,77,500 మధ్య, వైస్ అడ్మిరల్ వంటి ఉన్నత స్థాయి అధికారులు రూ. 1,82,200 నుంచి రూ. 2,25,000 మధ్య సంపాదిస్తారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ రెండూ సముద్ర భద్రతకు గణనీయమైన సహకారాన్ని అందిస్తాయి, అయితే దేనికది నిర్దిష్ట అర్హత ప్రమాణాలు, నియామక ప్రక్రియలు ఉంటాయి.

Tags:    

Similar News