Career After BA: డిగ్రీలో BA చేశారా.. ఇవి గొప్ప కెరీర్‌ ఆప్షన్స్‌..!

Career After BA: ఇంటర్‌ తర్వాత చాలామంది డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలో తెలియక గందరగోళంలో పడుతారు.

Update: 2023-08-29 08:32 GMT

Career After BA: డిగ్రీలో BA చేశారా.. ఇవి గొప్ప కెరీర్‌ ఆప్షన్స్‌..!

Career After BA: ఇంటర్‌ తర్వాత చాలామంది డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలో తెలియక గందరగోళంలో పడుతారు. సరైన కెరీర్‌ ఆప్షన్స్‌ ఎంచుకుంటే భవిష్యత్‌లో విజయం సాధిస్తారు లేదంటే బోల్తాపడుతారు. అందుకే ఆలోచించి మంచి కోర్సు ఎంచుకొని చదవాలి. ముఖ్యంగా డగ్రీలో బీఏ చేసిన తర్వాత పెద్దగా స్కోప్ లేదని చాలామంది విద్యార్థులు భావిస్తారు. కానీ BA తర్వాత ఉత్తమ కెరీర్ ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

డేటా సైంటిస్ట్

తరచుగా సైన్స్ స్ట్రీమ్ ఉన్న వ్యక్తులు మాత్రమే డేటా సైన్స్ జాబ్స్‌ చేస్తారని అనుకుంటారు. కానీ అదేం ఉండదు BA డిగ్రీతో కూడా డేటా సైంటిస్ట్ కెరీర్ చేయవచ్చు. ఇందుకోసం డేటా సైన్స్‌కు సంబంధించిన కోర్సు చేయాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించే వ్యక్తులు ఈ వృత్తిని కొనసాగించవచ్చు.

న్యాయవాది

లాయర్‌ కావడానికి బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటర్ లా అంటే LLB డిగ్రీని పొందడం అవసరం. ఈ కోర్సు చేసిన తర్వాత లాయర్‌గా ప్రాక్టీస్ చేయవచ్చు. LLB కాకుండా న్యాయవ్యవస్థపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సంస్థలు, కంపెనీలకు న్యాయ సలహాదారులుగా కూడా మారవచ్చు. దీనివల్ల చాలా డబ్బు సంపాదించవచ్చు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లు

బీఏ పూర్తి చేసిన తర్వాత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ చేయవచ్చు. దీని తర్వాత NET, JRF పరీక్ష లేదా PhD చేసి ఏదైనా విశ్వవిద్యాలయం, కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేయవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్

ఇది డిజిటల్ మార్కెటింగ్ కాలం. ఈ రంగంలో కెరీర్‌ చేస్తే చాలా అవకాశాలు ఉంటాయి. డిజిటల్ మార్కెటర్‌గా మారి మంచి సాలరీ పొందవచ్చు. బీఏ చేసిన వారు కూడా దీనికి అర్హులవుతారు.

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

మీరు BA తర్వాత MBA చేయవచ్చు. మంచి విశ్వవిద్యాలయం, కళాశాల లేదా IIM నుంచి MBA చేయడానికి CAT పరీక్ష రాయాలి. ఐఐఎంలో డిగ్రీ తీసుకున్న తర్వాత విద్యార్థులకు నెలకు లక్షల రూపాయల ప్యాకేజీ లభిస్తుంది.

Tags:    

Similar News