NIOS Jobs 2023: నిరుద్యోగులకు మంచి అవకాశం.. ఓపెన్ స్కూలింగ్‌లో పలు ఉద్యోగాలు..!
NIOS Jobs 2023: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది.
NIOS Jobs 2023: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) గ్రూప్ 'A', 'B' 'C' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ 30 నవంబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. 21 డిసెంబర్ 2023 వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nios.cbt-exam.in లేదా nios.ac.inలో సందర్శించి అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 28 పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 'A'లో 1 డిప్యూటీ డైరెక్టర్ (కెపాసిటీ బిల్డింగ్ సెల్), 1 డిప్యూటీ డైరెక్టర్ (అకడమిక్), 2 అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), 4 అకడమిక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 'బి'లో సెక్షన్ ఆఫీసర్ 2, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 1, EDP సూపర్‌వైజర్ 21, గ్రాఫిక్ ఆర్టిస్ట్ 1, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 1 పోస్టు ఉన్నాయి. గ్రూప్ 'సి'లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ 4, స్టెనోగ్రాఫర్ 3, జూనియర్ అసిస్టెంట్ 10, మొత్తం 11 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
అర్హత ఏమిటి?
డిప్యూటీ డైరెక్టర్ (కెపాసిటీ బిల్డింగ్ సెల్) పోస్ట్ కోసం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్ట్ కోసం అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. MTA పోస్టులకు బేసిక్ ఉత్తీర్ణత చాలు.
వయో పరిమితి
వివిధ పోస్టులకు వేర్వేరుగా వయోపరిమితి నిర్దేశించారు. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హత మొదలైన వాటికి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షల పద్దతిని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. అభ్యర్థులు చూడవచ్చు.