నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!

Indo-Tibetan Border Police: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Update: 2022-08-22 10:58 GMT

నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..!

Indo-Tibetan Border Police: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in సందర్శించి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 29 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 27, 2022న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద 52 గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.

అర్హత ప్రమాణాలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు పరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్/రివ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటాయి. దరఖాస్తులు సరైనవని గుర్తించిన అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ పరీక్షలో హాజరు కావడానికి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ITBP అధికారిక సైట్‌ని సందర్శించవచ్చు.

ఇది కాకుండా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఆగస్టు 19 నుంచి 108 కానిస్టేబుల్ (పయనీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 17. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ITBP వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు. ఈ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

Tags:    

Similar News