ISRO Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగం పొందడానికి సువర్ణవకాశం.. పదో తరగతి పాసైతే చాలు..!
ISRO Recruitment 2023: పదో తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి.
ISRO Recruitment 2023: పదో తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) నుంచి టెక్నిషియన్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంతో మంది యువత చిన్నప్పటి నుంచి ఇస్రోలో పనిచేయాలని కలలు కంటారు. ఇందులో వివిధ అర్హతల ప్రకారం అభ్యర్థులను నియమిస్తారు. ఇటీవల ఇస్రో టెక్నీషియన్ 'బి'/డ్రాఫ్ట్స్‌మెన్ 'బి' పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ పోస్టులకి అప్లై చేసే వ్యక్తులు 21 ఆగస్టు 2023 లోపు అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.inకి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిలో 34 ఖాళీలు టెక్నీషియన్ 'బి' పోస్టులు ఒక పోస్ట్ డ్రాఫ్ట్స్‌మన్ 'బి' ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టుల ఎంపిక కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
రాత పరీక్షను ముందుగా నిర్వహిస్తారు. ఇందులో 80 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి ఒక మార్కు తప్పు సమాధానానికి 0.33 నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష పేపర్ చేయడానికి 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులని 1:5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. అభ్యర్థులందరూ రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఫీజు మినహాయింపు వర్గాల వారు దరఖాస్తు రుసుము నుంచి రూ.100 మినహాయించి రూ. 400 తిరిగి పొందుతారు.