ISRO Recruitment 2023: పదో తరగతితో ఇస్రోలో ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..!

ISRO Recruitment 2023: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా చేసినవారికి ఇది సువర్ణవకాశం అని చెప్పాలి.

Update: 2023-03-29 09:29 GMT

ISRO Recruitment 2023: పదో తరగతితో ఇస్రోలో ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..!

ISRO Recruitment 2023: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా చేసినవారికి ఇది సువర్ణవకాశం అని చెప్పాలి. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి వంటి అనేక పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఏప్రిల్ 24, 2023 వరకు సమర్పించాలి. ఈ రిక్రూట్‌మెంట్‌ కింద మొత్తం 62 పోస్టులని భర్తీ చేస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత, డిప్లొమా ఉన్నవారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, అనుభవం, ఎంపిక ప్రమాణాలతో సహా మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 27, 2023

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023

విద్యా అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ సైన్స్/సివిల్), సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

టెక్నీషియన్ B : ITI సర్టిఫికేట్ ఉన్న యువత ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

హెవీ వెహికల్ డ్రైవర్ / లైట్ వెహికల్ డ్రైవర్ : 10వ తరగతి ఉత్తీర్ణులైన యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

ఫైర్‌మెన్ : 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 24. ఈ ఉద్యోగాల ఎంపిక రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష సమయం, తేదీని త్వరలో ఇస్రో ప్రకటించనుంది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

Tags:    

Similar News