పది, ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాలు..!
IRCTC Jobs 2022: పది, ఐటీఐ చదివిన వారికి ఇది శుభవార్తని చెప్పొచ్చు.
IRCTC Jobs 2022: పది, ఐటీఐ చదివిన వారికి ఇది శుభవార్తని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)లో అప్రెంటిస్‌షిప్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు 25 అక్టోబర్ 2022లోపు లేదా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విద్యార్హత
అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు కోపా ట్రేడ్‌లో అవసరమైన NCVT/SCVT నుంచి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.irctc.com/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
ఎలా అప్లై చేయాలి..?
1. ముందుగా https://www.irctc.com/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. హోమ్ పేజీలో కొత్త ఓపెనింగ్స్ విభాగానికి వెళ్లాలి.
3. "IRCTC నార్త్ జోన్, న్యూఢిల్లీలో అప్రెంటిస్‌ల ఎంగేజ్‌మెంట్" లింక్‌పై క్లిక్ చేయాలి. ఇది హోమ్ పేజీలో అందుబాటులో ఉంటుంది.
4. మీరు IRCTC అప్రెంటిస్ ట్రైనీ జాబ్స్ 2022 PDFని పొందే కొత్త విండోకు వెళుతారు.
5. భవిష్యత్ సూచన కోసం IRCTC అప్రెంటిస్ ట్రైనీ జాబ్స్ 2022ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయాలి.
6. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 25 అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 80 మంది అభ్యర్థులను నియమిస్తారు.