IOCL Jobs 2023: ఇంటర్, డిప్లొమా చేసినవారికి సువర్ణవకాశం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు..!
IOCL Jobs 2023: ఇంటర్, డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
IOCL Jobs 2023: ఇంటర్, డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1720 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com సందర్శించి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు, అర్హత
ఐఓసీఎల్ (IOCL) లో మొత్తం 1720 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు iocl.com. వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అక్టోబర్ 21వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ నవంబర్ 20వ తేదీతో ముగుస్తుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్ స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇంటర్మీడియట్ (Class XII) / గ్రాడ్యుయేట్/డిప్లోమా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా అర్హత పరీక్షలో వారు కనీసం 50% మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారు కనీసం 45% మార్కులు సాధించాలి.
వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు IOCL అధికారిక వెబ్ సైట్ iocl.com. సందర్శించి తెలుసుకోవచ్చు.