TS Inter: నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానున్న ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం..!

TS Inter: మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2022-05-15 10:18 GMT

TS Inter: నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానున్న ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం..!

TS Inter: మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం ఒక నెలరోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీనికి కారణం పదో తరగతి పరీక్షలు. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 12-13 తేదీల్లో టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అందువల్ల ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులకు జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభించడం సాధ్యం కాదు.

మరోవైపు 9 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల కోసం పరీక్షల కోసం 1,443 కేంద్రాలు సిద్ధంచేశారు. వీటిలో 26 సెల్ఫ్‌ సెంటర్లు ఉన్నాయి. 386 ప్రభుత్వ, 206 గురుకులాలు, 840 ప్రైవేట్‌ కాలేజీలు, 11 ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,07,393 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో వారికి 35 శాతం మార్కులు వేసి పాస్ చేశారు. సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసే ఛాన్స్ ఇస్తామని అప్పుడే ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. గతంలో ప్రకటించినట్టుగా ఇప్పుడు విద్యార్థులకు సెకండ్ ఇయర్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది.

Tags:    

Similar News