Indian Navy Jobs 2023: ఇండియన్ నేవీలో సూపర్ ఉద్యోగాలు.. పది, ఐటీఐ చేసినవారు అర్హులు..!
Indian Navy Jobs 2023: పది, ఐటీఐ చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian Navy Jobs 2023: పది, ఐటీఐ చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువకులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్www.indiannavy.nic.inకి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు ఎన్ని, దరఖాస్తు విధానం తదితర విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 26 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 25 సెప్టెంబర్ 2023 వరకు కొనసాగుతుంది. ఇండియన్ నేవీ మొత్తం 362 ట్రేడ్స్‌మన్ మేట్ పోస్టుల కోసం నియామకాలను చేపట్టింది. ఇందులో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ 151, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 35, ఎస్సీ 26, ఎస్టీ 26 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థులకి రాతపరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత తుది మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. అయితే అప్లై చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ karmic.andaman.gov.in/HQANC వెళ్లాలి.
2. తర్వాత అప్లై ఆన్‌లైన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
3. తర్వాత “ట్రేడ్స్‌మన్ మేట్, హెడ్‌క్వార్టర్స్, అండమాన్ & నికోబార్ కమాండ్ పోస్ట్ కోసం రిక్రూట్‌మెంట్” ఆప్షన్ ఎంచుకోవాలి.
4. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై ఎంచుకోవాలి.
5. ఇప్పుడు ఈ మెయిల్, మొబైల్ నంబర్‌తో సహా వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత "లాగిన్" పై క్లిక్ చేయాలి.
7. వ్యక్తిగత, అకడమిక్ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
8. తర్వాత వివరాలను సరిగ్గా చెక్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
9. తర్వాత నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
10. తర్వాత తదుపరి అవసరాల కోసం ఒక హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.