Indian Navy Recruitment 2023: పది, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..!
Indian Navy Recruitment 2023: ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ICET) 1/2023 ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుపెట్టింది.
Indian Navy Recruitment 2023: ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ICET) 1/2023 ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికింద 910 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మన్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి నౌకాదళ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌కు https://www.joinindiannavy.gov.in/వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది.
ఇండియన్ నేవీ అందించే 910 ఖాళీలలో ట్రేడ్స్‌మన్ మేట్ కోసం 610 పోస్ట్‌లు, సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ కోసం 258 పోస్ట్‌లు, ఛార్జ్‌మ్యాన్ పాత్రల కోసం 42 పోస్ట్‌లు ఉన్నాయి. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా అప్లై చేసుకోవాలనుకునే వ్యక్తులు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అయితే నిర్దిష్ట పోస్టులకు గరిష్ట వయోపరిమితి మారుతూ ఉంటుంది. ఛార్జ్‌మ్యాన్, ట్రేడ్స్‌మన్ మేట్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు, సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ పాత్రలకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా నిర్ణయించారు.
కీలక తేదీలు
1. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 18, 2023
2. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ముగింపు తేదీ: డిసెంబర్ 31, 2023
అవసరమైన విద్యార్హతలు
1. ట్రేడ్స్‌మెన్ మేట్: 10వ తరగతి ఉత్తీర్ణత + ఐటీఐ
2. ఛార్జ్‌మెన్: సంబంధిత రంగంలో B.Sc./డిప్లొమా.
3. సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్: సంబంధిత రంగంలో ఐటీఐ/డిప్లొమా
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నేవీలో గేట్‌వేగా ఉపయోగపడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేయాలి. దేశంలోని గౌరవనీయమైన రక్షణ దళాలలో ఒకటైన నేవీలో కెరీర్ మార్గాన్ని కొనసాగించవచ్చు. మరిన్ని వివరాల కోసం దరఖాస్తుదారులు అధికారిక బ్‌సైట్ https://www.joinIndiannavy.gov.in/ని చూడవచ్చు.