Indian Coast Guard Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ ఉద్యోగాలు..!
Indian Coast Guard Recruitment 2024: ఇంటర్ పాసైన నిరుద్యోగులు, విద్యార్థులకు ఇది శుభవార్తనే చెప్పాలి.
Indian Coast Guard Recruitment 2024: ఇంటర్ పాసైన నిరుద్యోగులు, విద్యార్థులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT) 02/2024 ద్వారా 260 సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం అప్లికేషన్లు ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు ICG అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ joinIndiancoastguard.cdac.inలో ఫిబ్రవరి 06, 2024 నుంచి ఫిబ్రవరి 13, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
ఉత్తరం 79
వెస్ట్ 66
ఈశాన్య 68
తూర్పు 33
వాయువ్యం 12
అండమాన్ & నికోబార్ 03
మొత్తం 260
అర్హతలు
కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE)చే గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్‌తో 10+2 ఉత్తీర్ణత కావాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియలో అభ్యర్థులు తమ మార్క్ షీట్‌లో నిర్దేశించిన అన్ని సబ్జెక్టుల నంబర్లను కచ్చితంగా నింపాలి. తప్పుగా నింపితే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు.
వయస్సు పరిధి
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వ్యక్తుల కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్టంగా 22 సంవత్సరాలు ఉండాలి. సెయిలర్ (GD) పోస్ట్ కోసం అప్లికేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు 01 సెప్టెంబర్ 2002 నుంచి 31 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలని గుర్తుంచుకోండి. ఇది కాకుండా పురుష భారతీయ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ
1. ఈ పోస్ట్‌లకు అప్లై చేయడానికి ముందుగా ICG సెయిలర్ GD అధికారిక వెబ్‌సైట్ https://joinIndiancoastguard.cdac.in/cgept/ వెళ్లాలి.
2. హోమ్ పేజీలో “ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దానిని తప్పులు లేకుండా నింపాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
4. తర్వాత అప్లికేషన్ రుసుమును చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.
5. తర్వాత ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.