ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. అర్హత ఇంటర్.. జీతం నెలకు రూ. 63200..
Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వెలువడిన సమాచారం ప్రకారం.. 45 రోజులలోపు ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు హిందీలో ఉండాలి. ఆంగ్లంలో టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు ఉండాలి.
ఈ పోస్టులకు వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపిక గురించి మాట్లాడితే అభ్యర్థులు రాత పరీక్ష, టైపింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక అవుతారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను ఒకసారి పూర్తిగా చదవాలి. దరఖాస్తు ఫారంలో అన్ని అంశాలని నింపాల్సి ఉంటుంది. లేదంటే మీ దరఖాస్తును రద్దు చేసే అవకాశాలు ఉంటాయి.
పరీక్షా సరళి
పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.పేపర్‌ను పరిష్కరించడానికి మీకు 2 గంటల సమయం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తు ఫారమ్‌ను పంపుతున్నప్పుడు LDC పోస్ట్ కోసం అని పైన రాయాలి. మీరు నింపిన ఫారమ్‌ను కమాండెంట్, ఆర్మీ AD సెంటర్, గంజాం (ఒడిశా) పిన్ - 761052కు పంపిచాల్సి ఉంటుంది.