పది, ఇంటర్‌తో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం.. అప్లై ఎప్పటి నుంచంటే..?
పది, ఇంటర్‌తో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం.. అప్లై ఎప్పటి నుంచంటే..?
Indian Air Force Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు జనవరి 2023 బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియను నవంబర్ 2022 మొదటి వారం నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు IAF రిక్రూట్‌మెంట్ వెబ్ పోర్టల్ https://agnipathvayu.cdac.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అర్హత సాధించిన అభ్యర్థులను జనవరి 2023 మధ్యలో ఆన్‌లైన్ పరీక్షకు పిలుస్తారు.
IAF అగ్నివీర్ వాయు అర్హతలు..
1. మీరు భారత పౌరులైతే 29 డిసెంబర్ 1999 నుంచి 29 జూన్ 2005 మధ్య జన్మించి ఉండాలి
2. మీరు భారత వైమానిక దళానికి చెందిన NC(E)కి చెందినవారు అయితే పుట్టిన తేదీ క్రింది విధంగా ఉంటుంది.
(A) వివాహిత NC (E) 29 డిసెంబర్ 1993 నుంచి 29 డిసెంబర్ 2000 వరకు ఉంటుంది.
(B) అవివాహిత NC (E) 29 డిసెంబర్ 1993 నుంచి 29 జూన్ 2005 వరకు ఉంటుంది.
విద్యా అర్హత
బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన బోర్డు/సంస్థ నుంచి 10+2 తరగతి/ఇంటర్మీడియట్/తత్సమాన పరీక్షలో ఫిజిక్స్/మ్యాథ్స్/ఇంగ్లీష్‌తో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 తరగతి/ఇంటర్మీడియట్/తత్సమాన పరీక్ష మార్కు షీట్ ప్రకారం ఆంగ్లంలో 50% మార్కులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.