India Post GDS Job 2023: జీడీఎస్ చిన్న ఉద్యోగమే కానీ ఎందుకంత క్రేజ్.. పూర్తి వివరాలు..!
India Post GDS Job 2023: ప్రతి సంవత్సరం పోస్టల్ శాఖ నుంచి జీడీఎస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది.
India Post GDS Job 2023: ప్రతి సంవత్సరం పోస్టల్ శాఖ నుంచి జీడీఎస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ సంవత్సరం ఏకంగా 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 50,000 ఉద్యోగాలని భర్తీ చేసింది. యువత పెద్ద సంఖ్యలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ ఒక మెరుగైన ఉద్యోగ ప్రొఫైల్. కేవలం 3 నుంచి 4 గంటలు పనిచేయడం వల్ల నెలకి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవారు ఈ జాబ్ చేసుకుంటూ పరీక్షలు రాసుకోవచ్చు. చదువుకోవడానికి సమయం కలిసివస్తుంది. జీతం, అలవెన్స్, ప్రమోషన్స్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
భారతీయ పోస్టల్ సర్వీస్ ప్రపంచంలోనే అతిపెద్ద పోస్ట్ నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. GDS ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఒకటిగా హైస్కూల్/మెట్రిక్యులేషన్ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా దరఖాస్తుదారు కనీసం 10వ తరగతి వరకు స్థానిక భాషను చదివి ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
GDS జీతం
ఇండియా పోస్ట్ తన ఉద్యోగులకు ఆకర్షణీయమైన జీతం, వివిధ అలవెన్సులను అందిస్తుంది. GDS జీతం 7వ వేతన సంఘం సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో నెలకు రూ. 10,000 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే నెలకు రూ.14,500 లభిస్తాయి. సర్వీస్ పెరిగిన కొద్ది జీతం కూడా పెరుగుతుంది. డిపార్ట్‌మెంటల్ పరీక్షలు రాసుకోవడం ద్వారా ఉన్నత ఉద్యోగాలకి వెళ్లవచ్చు. ఇందులో వీరికి మెరుగైన అవకాశాలు కూడా కల్పిస్తారు.
జీడీఎస్ సౌకర్యాలు, అలవెన్సులు
1. ఆఫీస్ మెయింటనెన్స్
2. స్టేషనరీ మెయింటనెన్స్
3. టీఏ అలవెన్స్
4. డియర్‌నెస్ అలవెన్స్ (DA)
5. హెల్త్ అలవెన్స్