Future Demand Jobs: రాబోయే 5 ఏళ్లలో ఈ జాబ్స్‌కు విపరీతమైన డిమాండ్.. జీతం అత్యంత వేగంగా పెరుగుతుంది..!

Future Demand Jobs: విద్యార్థులు కాలేజీకి వెళ్లినప్పుడు బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే కలతో వెళుతారు.

Update: 2023-12-05 14:30 GMT

Future Demand Jobs: రాబోయే 5 ఏళ్లలో ఈ జాబ్స్‌కు విపరీతమైన డిమాండ్.. జీతం అత్యంత వేగంగా పెరుగుతుంది..!

Future Demand Jobs: విద్యార్థులు కాలేజీకి వెళ్లినప్పుడు బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే కలతో వెళుతారు. కాలేజీ నుంచి పాసయ్యాక మంచి కంపెనీలో ప్లేస్‌మెంట్ రావాలి, జీతం అధికంగా ఉండాలని కోరుకుంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023 ప్రకారం.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 5 ఉద్యోగాల జాబితాను ఈ రోజు తెలుసుకుందాం.

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. డేటా సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీర్ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉద్యోగాల్లో జీతం ప్రారంభంలోనే అధికంగా ఉంటుంది. అనుభవంతో మరింత పెరుగుతుంది.

డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉద్యోగాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ ఉద్యోగాలలో డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఉన్నారు. జీతం అధికంగా లభిస్తుంది అనుభవంతో మరింత పెరుగుతుంది.

బిజినెస్ అనలిటిక్స్‌

బిజినెస్ అనలిటిక్స్‌ ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ఉద్యోగాలలో వ్యాపార విశ్లేషణ నిపుణులు, డేటా విశ్లేషకులు, సేల్స్ విశ్లేషకులు ఉంటారు. ఈ ఉద్యోగాలలో జీతం ఎక్కువగా ఉంటుంది. అనుభవంతో మరింతపెరుగుతుంది.

సైబర్ సెక్యూరిటీ

సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్నందున సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఉద్యోగాలలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సమాచార భద్రతా విశ్లేషకులు, నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్లు ఉంటారు. ఈ ఉద్యోగాలలో జీతం బాగానే ఉంటుంది. అనుభవంతో మరింత పెరుగుతుంది.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే వ్యాపారాలు నడపడానికి కొత్త కొత్త సాఫ్ట్‌వేర్లు అవసరం. ఈ ఉద్యోగాలలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, ప్రోగ్రామర్లు, కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీర్లు అవసరమవుతారు. జీతం బాగా ఉంటుంది. అనుభవంతో మరింత పెరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాలలో కెరీర్ చేయడానికి, అభ్యర్థులకు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లేదా డేటా సైన్స్‌లో డిగ్రీ చదివి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు అనుభవం అవసరం అవుతుంది.

Tags:    

Similar News