Best Diploma Courses: ఈ డిప్లొమా కోర్సులకి డిమాండ్ ఎక్కువ.. తొందరగా జాబ్‌లో ఉంటారు..!
Best Diploma Courses: ఇంటర్ పూర్తై ఏ కోర్సులు చేయాలో తెలియక తికమక పడుతున్న విద్యార్థులకి ఈ డిప్లొమా కోర్సులు సూపర్ అని చెప్పవచ్చు.
Best Diploma Courses: ఇంటర్ పూర్తై ఏ కోర్సులు చేయాలో తెలియక తికమక పడుతున్న విద్యార్థులకి ఈ డిప్లొమా కోర్సులు సూపర్ అని చెప్పవచ్చు. అంతేకాక కొంతమంది తక్కువ విద్యార్హతతో ఉద్యోగం సంపాదించాలనుకుంటే ఈ డిప్లొమా కోర్సులు బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక తొందరగా జాబ్ చేయాలనుకుంటున్న వ్యక్తులకి కూడా ఈ కోర్సులు ఉత్తమమైనవని చెప్పవచ్చు. ఈ డిప్లొమా కోర్సులు చేసిన తర్వాత కోరుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు. మంచి జీతంతో జీవితంలో సెటిల్ కావొచ్చు. ఆ కోర్సులేంటో ఈ రోజు తెలుసుకుందాం.
1. డి ఫార్మాసీ
మీరు వైద్య రంగంలో కెరీర్ చేయాలనుకుంటే మీరు డి ఫార్మా చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత సొంత మెడికల్ స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కూడా పని చేయవచ్చు.
2. హోటల్ మేనేజ్‌మెంట్
ఇంటర్ పాసైన తర్వాత వెంటనే హోటల్ పరిశ్రమలో వృత్తిని చేపట్టవచ్చు. ఇందుకోసం హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పొందాలి. ఇందులో చేరితే చిన్న వయసులోనే మంచి జీతంతో ఉద్యోగం పొందవచ్చు.
3. కంప్యూటర్ సైన్స్
నేటి కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ఉద్యోగం రావడం చాలా కష్టం. దీనిపై పట్టు సాధిస్తే మంచి జాబ్ లైన్‌లో ఉంటుంది. అందుకే కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా తీసుకోవచ్చు.
4. యానిమేషన్, మల్టీమీడియా
యానిమేషన్,మల్టీమీడియా ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. దీంతో పాటు కెరీర్‌ను గ్రాఫిక్ డిజైనర్‌గా రూపొందించుకోవచ్చు.
5. పాలిటెక్నిక్, ITI
పాలిటెక్నిక్, ఐటీఐ చేయడానికి ఇంటర్ పాస్ కావాల్సిన అవసరం లేదు. 10వ తరగతి ఆధారంగా ఈ కోర్సులో చేరవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలో మంచి ఉద్యోగం పొందవచ్చు.
6. నర్సింగ్
బాలికలకు ఇది చాలా మంచి ఎంపికని చెప్పవచ్చు. నర్సింగ్‌లో డిప్లొమా చేయడం వల్ల ఏదైనా ఆసుపత్రిలో సులభంగా ఉద్యోగం పొందవచ్చు.
7. ఇంటీరియర్ డిజైనింగ్
ఆర్ట్, డిజైనింగ్ అంటే ఇష్టపడే విద్యార్థులు ఇంటీరియర్ డిజైనర్‌గా కెరీర్‌ను రూపొందించుకోవచ్చు. ఈ రంగంలో పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది.