IAS Aspirant Habits: ఐఏఎస్‌ కావాలంటే కచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలి.. మీలో ఉన్నాయా..?

IAS Aspirant Habits: చాలామంది సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ అవ్వాలని కలలు కంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు.

Update: 2024-03-19 11:30 GMT

IAS Aspirant Habits: ఐఏఎస్‌ కావాలంటే కచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలి.. మీలో ఉన్నాయా..?

IAS Aspirant Habits: చాలామంది సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ అవ్వాలని కలలు కంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ కూడా ఒకటి. చాలామంది ఐఏఎస్‌ అవ్వాలని ప్రయత్నించి మధ్యలోనే వెనుదిరుగు తారు. మరికొంతమంది వేరే పోటీ పరీక్షలు రాసి వాటిలో సెటిల్‌ అవుతారు. నిజానికి ఐఏఎస్‌ అవ్వాలని కలలు కంటే సరిపోదు. దానికోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఒక ఐఏఎస్‌ ఆస్పిరెంట్‌కు కచ్చితమైన కొన్ని లక్షణాలు ఉండాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలనే వ్యక్తి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. రెగ్యులర్ స్టడీస్ ప్రిపరేషన్ కొనసాగించాలి. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. ఏకాగ్రతను చెదరనివ్వకూడదు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకునేవారు మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో ఏకాగ్రతతో చదవాలి. దీనివల్ల తొందరగా విజయాన్ని సాధిస్తారు. ఆత్మ విశ్వాసం బలంగా ఉండాలి. ఇది విజయావకాశాలను పెంచుతుంది.

పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉండాలి. దీనివల్ల సవాళ్లను ఎదుర్కోవడం సులభతరం అవుతుంది. విజయం సాధించాలంటే వదలని ధైర్యం అవసరం. నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి. కోరిక అన్ని రకాల జ్ఞానాన్ని అందిస్తుంది. ఐఏఎస్‌ పరీక్షకు సిద్ధం కావడానికి సమాచార సేకరణ చేయాలి. సమాజం పట్ల బాధ్యతగా కలిగి ఉండాలి.ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన ఉండాలి. నాయకత్వ సామర్థ్యం మీలోని ఐఏఎస్‌ను మేల్కొని ఉంచుతుంది.

Tags:    

Similar News