IDBI Recruitment 2022: నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌.. IDBI బ్యాంకు నుంచి 1544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

IDBI Recruitment 2022: బ్యాంకింగ్‌లో కెరీర్‌ను సంపాదించాలనే యువత కోసం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది.

Update: 2022-06-08 03:30 GMT

IDBI Recruitment 2022: నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌.. IDBI బ్యాంకు నుంచి 1544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

IDBI Recruitment 2022: బ్యాంకింగ్‌లో కెరీర్‌ను సంపాదించాలనే యువత కోసం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ (ఎగ్జిక్యూటివ్), అసిస్టెంట్ మేనేజర్ (AM గ్రేడ్ A) పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 1544 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు idbibank.in బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రిక్రూట్‌మెంట్ ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 3 జూన్ 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 17 జూన్ 2022

దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ- 17 జూన్ 2022

రిక్రూట్‌మెంట్ టెస్ట్/ఇంటర్వ్యూ తేదీ - ఇంకా నిర్ణయించలేదు.

నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద బ్యాంక్ 1544 పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీటిలో 1044 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 500 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వారీగా ఖాళీలని చూడటానికి మీరు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి తెలుసుకోవచ్చు.

అవసరమైన అర్హత, వయోపరిమితి

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి గురించి మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల వరకు వయోపరిమితిని కోరింది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..?

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ idbibank.inని సందర్శించాలి. ఇక్కడ వారు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ను పొందుతారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా మీరు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.

Tags:    

Similar News