ICF Apprentice Recruitment 2024: పది, ఐటీఐ, ఇంటర్ చదివినవాళ్లకి గుడ్ న్యూస్.. ఐసీఎఫ్ లో అప్రెంటీస్ పోస్టులు..!

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఐసీఎఫ్లో మొత్తం 1,010 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Update: 2024-05-30 12:30 GMT

ICF Apprentice Recruitment 2024: పది, ఐటీఐ, ఇంటర్ చదివినవాళ్లకి గుడ్ న్యూస్.. ఐసీఎఫ్ లో అప్రెంటీస్ పోస్టులు..!

ICF Apprentice Recruitment 2024: పది, ఐటీఐ, ఇంటర్ పాసైన యువతకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఉద్యోగం పొందడానికి సువర్ణవకాశం వచ్చింది. ఐసీఎఫ్ లో వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pb.icf.gov.in ను సందర్శించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ జూన్ 21గా నిర్ణయించారు. విద్యార్హత, తదితర విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఐసీఎఫ్లో మొత్తం 1,010 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఐసీఎఫ్ చెన్నై అప్రెంటిస్ సీట్లు ఫ్రెషర్స్, ఎక్స్ ఐటీఐ అభ్యర్థుల మధ్య విభజించారు. ఎక్స్ ఐటీఐ అభ్యర్థులకు 330 ఖాళీలు ఫ్రెషర్లకు 680 ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి

ఐసీఎఫ్ చెన్నై అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నాన్ ఐటీఐ -దరఖాస్తుదారులకు గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు. అదే సమయంలో, SC/ST వంటి రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు లభిస్తుంది.

విద్యార్హత:

ప్రీ- ఐటిఐ అభ్యర్థులకు ఫిట్టర్,ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50%తో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు 12వ తరగతిలో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు జాతీయ లేదా రాష్ట్ర కౌన్సిల్ నుండి సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కార్పెంటర్లు, పెయింటర్లు, వెల్డర్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా జాతీయ లేదా రాష్ట్ర వృత్తి శిక్షణ మండలి జారీ చేసిన NTC సర్టిఫికేట్ కలిగి ఉండాలి. PASSA ట్రేడ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ సపోర్ట్ ట్రేడ్‌లో NTC సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

ఫ్రెషర్స్‌కు విద్యార్హత

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతంతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 సిస్టమ్‌లో సైన్స్, మ్యాథ్స్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ కోసం దరఖాస్తు చేసుకునే ఫ్రెషర్లు 50 శాతంతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. MLT రేడియాలజీ, పాథాలజీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు PCBతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం

ముందుగా pb.icf.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

ఇప్పుడు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న 'Apply for Act Apprentice 2024-25' లింక్‌పై క్లిక్ చేయాలి.

తర్వాత 'ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్' ఆప్షన్కి వెళ్లాలి.

ఇప్పుడు మీ విద్యార్హత ప్రకారం ప్రీ-ఐటీఐ లేదా ఫ్రెషర్ ఆప్షన్‌ల మధ్య ఎంచుకోండి.

ఇప్పుడు మిమ్మల్ని మీరు పోర్టల్‌లో నమోదు చేసుకోండి.

అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

దీని తర్వాత నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

తర్వాత అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోవాలి.

Tags:    

Similar News