పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు..!
పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు..!
IB Recruitment 2023: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (SA/EXE), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/GEN) పోస్టుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 17, 2023 వరకు అప్లై చేసుకోవచ్చు.
ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆ తేదీని జనవరి 28, 2023కి మార్చారు. మొత్తం పోస్టులలో 1525 సెక్యూరిటీ అసిస్టెంట్, 150 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్థి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
1. అభ్యర్థులు ముందుగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ mha.gov.inకి వెళ్లండి.
2. హోమ్‌పేజీలో "IBలో SA/Exe & MTS(Gen) పోస్టుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్స్"పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు ఒక న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. పేరు నమోదు చేసుకోండి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
4. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుమును చెల్లించండి.
5. భవిష్యత్తు సూచన కోసం మీ ఫారమ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి.
6. అభ్యర్థులందరూ పరీక్ష రుసుము రూ.50, రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ రూ.450 చెల్లించాలి.