Loco Pilot: రైల్వేలో లోకో పైలెట్‌ ఉద్యోగం.. మంచి వేతనం ప్రమోషన్స్‌.. ఎలా సాధించాలి..?

Loco Pilot: ఇండియాలో చాలామంది యువత భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని కలలు కంటారు.

Update: 2023-06-13 06:01 GMT

Loco Pilot: రైల్వేలో లోకో పైలెట్‌ ఉద్యోగం.. మంచి వేతనం ప్రమోషన్స్‌.. ఎలా సాధించాలి..?

Loco Pilot: ఇండియాలో చాలామంది యువత భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అంతేకాదు దానికోసం రాత్రింబవళ్లు కష్టపడుతారు. ముఖ్యంగా ఈరోజుల్లో రైలు డ్రైవర్ ఉద్యోగం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అయితే లోకో పైలెట్‌గా ఎంపిక కావాలంటే అంత సులువు కాదు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రైల్వే నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అందులో లోకోపైలెట్‌ ఉద్యోగం ఎలా సాధించాలో ఈరోజు తెలుసుకుందాం.

విద్యా అర్హత

భారతీయ రైల్వేలో లోకో పైలట్ కావాలంటే అభ్యర్థులు ముందుగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత అతను మెకానికల్, ఎలక్ట్రికల్, టెక్నీషియన్ తదితర ట్రేడ్‌లలో ఐటీఐ అర్హతను కలిగి ఉండాలి.

వయో పరిమితి

లోకో పైలట్ కావడానికి అభ్యర్థి గరిష్ట వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రారంభంలో అసిస్టెంట్ లోకోమోటివ్ డ్రైవర్లను రైల్వే రిక్రూట్ చేస్తుంది. తర్వాత అనుభవం ఆధారంగా పదోన్నతులు అందిస్తుంది.

రాత పరీక్ష

లోకో పైలట్ పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ సహా వివిధ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు (MCQS) అడుగుతారు.

నెగెటివ్ మార్కు

లోకో పైలెట్‌ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులకు మెడికల్ టెస్టు ఉంటుంది. ఇందులో వారి కళ్ళని పరీక్షిస్తారు. ఎందుకంటే వీరి చిన్న పొరపాటు రైలులో కూర్చున్న ప్రయాణీకులను చంపుతుంది. అందుకే అభ్యర్థులు వైద్య పరీక్షల క్లిష్టమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.

మొదటి పోస్టింగ్

మెడికల్ పోస్టింగ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆపై అభ్యర్థుల శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ తర్వాత మొదట అసిస్టెంట్ లోకో పైలట్‌గా గూడ్స్ రైలును నడిపే బాధ్యతను అప్పగిస్తారు. దీని తర్వాత వారు ప్యాసింజర్ రైలును నడపడానికి అనుమతిస్తారు.

జీతం

అసిస్టెంట్ లోకో పైలట్‌కు ప్రారంభంలో 30 నుంచి 35 వేల జీతం లభిస్తుంది. ఇది కాకుండా అన్ని రకాల అలవెన్సులు, సౌకర్యాలు లభిస్తాయి. ప్రమోషన్ తర్వాత వారు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్, లోకో సూపర్‌వైజర్ పోస్టులకు చేరుకుంటారు. అనుభవంతో జీతం కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News