India Post Jobs 2023: పోస్టాఫీసు జాబ్స్‌కి జీతం, అలవెన్సులు ఎంత.. పని విధానం ఏ విధంగా ఉంటుంది..?
India Post Jobs 2023: ఇటీవల ఇండియా పోస్ట్ 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
India Post Jobs 2023: ఇటీవల ఇండియా పోస్ట్ 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇందులో ఎక్కవగా BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్), ABPM (అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్), డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకి జీతం, అలవెన్సులు, పని విధానం గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు కొంతమందికి సెట్ అవుతాయి మరికొంతమందికి సెట్ అవ్వవు అంటున్నారు. అందుకే ఈ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
GDS అభ్యర్థుల జీత భత్యాలు
GDSకి ఎంపికైన అభ్యర్థులు నెలవారీ జీతం రూ.10,000 పొందుతారు. దీంతో పాటు 4500 రూపాయల TRCA (సమయ సంబంధిత కంటిన్యూటీ అలవెన్స్) పొందుతారు. పని వేళల ఆధారంగా ఇండియా పోస్ట్ GDS మొత్తం జీతం రూ.14,500 (సుమారుగా) ఉంటుంది.
వార్షిక ప్యాకేజీ
ఇండియా పోస్ట్ GDS వార్షిక ప్యాకేజీ పోస్ట్‌లను బట్టి మారుతుంది. తాజా సమాచారం ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ వార్షిక ప్యాకేజీ రూ.1,30,000 నుంచి రూ.1,50,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) గ్రామ్ డాక్ సేవక్‌లది రూ.1,20,000 నుంచి రూ.1,30,000 వరకు ఉంటుంది.
GDS అలవెన్సులు
సమయ-సంబంధిత కంటిన్యూటీ అలవెన్స్ (TRCA)
డియర్‌నెస్ అలవెన్స్ (DA)
ఇండియా పోస్ట్ GDS ఉద్యోగ ప్రొఫైల్
ఇండియా పోస్ట్ GDS కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబ్ ప్రొఫైల్ పోస్ట్‌లను బట్టి భిన్నంగా ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్‌లో కొన్ని టాస్క్‌లు ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (B.O.) అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) రోజువారీ పోస్టల్ కార్యకలాపాలు నిర్వహించాలి. ఇక సింగిల్ హ్యాండ్ BOలో మెయిల్ రవాణా, మెయిల్ డెలివరీతో సహా సమయానుసారంగా పని నిర్వహించడానికి BPM బాధ్యతను కలిగి ఉంటాడు.
సింగిల్ హ్యాండ్ కాకుండా ఇతర BOలలో BPMకి ABPM సహాయం చేయవచ్చు. అయితే ABPM అందుబాటులో లేని సందర్భంలో BPM ABPM విధులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మెయిల్ ఓవర్‌సీర్ (MO)/ఇన్‌స్పెక్టర్ పోస్ట్ (IPO)/అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ (ASPO)/పోస్టాఫీసు సూపరింటెండెంట్ (SPO)/పోస్టాఫీసు సీనియర్ సూపరింటెండెంట్ (SSPO) వంటి ఉన్నతాధికారులు ఇతర పనులని కూడా కేటాయిస్తే కచ్చితంగా చేయాలి.