UGC NET: నెట్‌లో అర్హత సాధించారా.. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా ఈ అవకాశాలు..!
UGC NET: ఏదైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటే కచ్చితంగా యూజీసీ (యూనియన్ గ్రాంట్‌కమిషన్) నిర్వహించే నెట్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలి.
UGC NET: ఏదైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటే కచ్చితంగా యూజీసీ (యూనియన్ గ్రాంట్‌కమిషన్) నిర్వహించే నెట్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలి. లేదంటే సెట్ (స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్) అయినా క్వాలిఫై అయి ఉండాలి. అయితే యూజీసీ నెట్‌లో క్వాలిఫై అయినవారిలో కొంతమంది జేఆర్ఎఫ్‌కి (జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్) ఎంపికవుతారు. మిగతావారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆప్షన్‌ని ఎంచుకుంటారు. వీటితో పాటు మరికొన్ని అవకాశాలు కూడా వీరికి లభిస్తాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
గతంలో చాలా మంది యువత డాక్టర్, ఇంజనీర్ లేదా సైంటిస్ట్ కావాలని మాత్రమే కలలు కనేవారు కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. ఇప్పుడు యువత విభిన్న రంగాల్లో కెరీర్ చేయాలని కోరుకుంటున్నారు. యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీఎస్‌యూలలో (పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్) కూడా ఉద్యోగం చేయవచ్చు. విద్య, పరిశోధన రంగంలో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నెట్ అర్హత పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు వారి పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్‌లో పరిశోధన చేయవచ్చు.
2. నెట్ కోఆర్డినేటర్లు ఇన్‌స్టిట్యూట్‌లలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఎంచుకోవచ్చు.
3. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన వారికి రెండు ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది శాశ్వత ఉద్యోగం, రెండవది డాక్టరేట్ డిగ్రీని పొందడం
4. ఏదైనా కార్పొరేట్ కంపెనీలో పరిశోధన చేయవచ్చు.
5. దేశంలో కొన్ని సంస్థలు లేదా కంపెనీలు జేఆర్ఎఫ్ అర్హత కలిగిన వ్యక్తులని పరిశోధన కోసం నియమించుకుంటాయి.
పీహెచ్ డీలో అడ్మిషన్
నెట్ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణులై పీహెచ్‌డీలో అడ్మిషన్ తీసుకున్న వారికి 5 ఏళ్లపాటు ఫెలోషిప్ ఇస్తారు. మొదటి 2 సంవత్సరాలకు 31,000, ఇంటి అద్దె భత్యం ప్రతి నెల చెల్లిస్తారు. తర్వాత 3 సంవత్సరాలకు 35,000 ఇంకా ఇంటి అద్దె భత్యం చెల్లిస్తారు. అయితే స్కాలర్‌షిప్ మొత్తం ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు మారుతుంది. ఇది కాకుండా సంబంధిత విశ్వవిద్యాలయం విధానం ప్రకారం సౌకర్యాలు, గ్రాంట్లు అందుతాయి.