SSC GD కానిస్టేబుల్‌కి అప్లై చేశారా.. అడ్మిట్ కార్డ్, ఎంపిక ప్రక్రియ, సిలబస్ గురించి తెలుసుకోండి..!

SSC GD Constable 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో SSC GD కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ విడుదల చేయనుంది.

Update: 2024-01-29 11:30 GMT

SSC GD కానిస్టేబుల్‌కి అప్లై చేశారా.. అడ్మిట్ కార్డ్, ఎంపిక ప్రక్రియ, సిలబస్ గురించి తెలుసుకోండి..!

SSC GD Constable 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో SSC GD కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ విడుదల చేయనుంది. తర్వాత కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.షెడ్యూల్ ప్రకారం కమిషన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో రైఫిల్‌మ్యాన్ (GD), SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ పరీక్ష ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, మార్చి 1, 5, 6, 7, 11, 12 తేదీలలో నిర్వహిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 26,146 ఉద్యోగాలను భర్తీ చేయాలని సెలక్షన్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

SSC GD కానిస్టేబుల్ 2024 హాల్ టికెట్‌ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లాలి.

2. హోమ్‌పేజీలో GD కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. తర్వాత మరో కొత్త పేజీకి వెళుతారు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి ఓకె చేయాలి.

4. మీ SSC కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

5. ఇప్పుడు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

ఇది కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ రకం పరీక్ష. ఇది అభ్యర్థుల సాధారణ జ్ఞానం, తార్కిక సామర్థ్యం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను అంచనా వేస్తుంది. పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి.

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

అభ్యర్థుల ఫిజికల్ ఫిట్‌నెస్, స్టామినాను అంచనా వేయడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. PETలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఉంటాయి. PSTలో ఎత్తు, బరువు, ఛాతీ విస్తరణ, కంటి పరీక్షలు ఉంటాయి.

వైద్య పరీక్ష

అభ్యర్థులు సైన్యంలో చేరేందుకు వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. సాధారణ శారీరక పరీక్ష, రక్త పరీక్ష, ఎక్స్-రే, అవసరాన్ని బట్టి ఇతర పరీక్షలు ఉంటాయి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఈ దశలో విద్యార్హత సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), క్యారెక్టర్ సర్టిఫికేట్ వంటి పత్రాలను కమిషన్ ధృవీకరిస్తుంది.

రాత పరీక్ష (CBT) సిలబస్

1. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్

2. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్

3. ప్రాథమిక గణితం

4. ఇంగ్లీష్/హిందీ

5. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

6. జీతం పే లెవెల్ - 3 ప్రకారం నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు పొందుతారు.

Tags:    

Similar News