NEP Conference 2022: ది హన్స్ ఇండియా ఆధ్వర్యంలో విద్యా సదస్సు
NEP Conference 2022: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ - NEP 2022 ద్వారా విద్యారంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.
NEP Conference 2022: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ - NEP 2022 ద్వారా విద్యారంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనిమీద ఇంకా చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడలేదు. విద్యారంగంలోని మార్పులను ఆకళింపు చేసుకోవడం ఎలా.. పిల్లలకు ఏవిధంగా అప్లయి చేయాలి.. పేరెంట్స్ తయారీ ఎలా ఉండాలి.. విద్యాసంస్థలు ఏవిధంగా సంసిద్ధం కావాల్సి ఉంది.. అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ది హన్స్ ఇండియా సంకల్పించింది. ఇందుకోసం హైదరాబాద్ లో వినూత్నంగా విద్యా సదస్సు ఏర్పాటు చేసింది. శిల్పకళా వేదికలో ఇవాళ, రేపు ఈ సదస్సు జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 అమలులో భాగంగా ఇప్పుడున్న 10 + 2 స్థానంలో 5 + 3 + 3 + 4 పద్ధతిలో విద్యాబోధన కొనసాగుతుంది.