GSL Notification 2024: గోవాలో జాబ్ చేయాలనుకుంటున్నారా.. ఈ పోస్టులకు అప్లై చేసుకోండి..!
GSL Notification 2024: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) అసిస్టెంట్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, రికార్డ్ కీపర్, కుక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (HR),
GSL Notification 2024: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) అసిస్టెంట్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, రికార్డ్ కీపర్, కుక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (HR), ఇతర పోస్టులతో సహా 106 వేర్వేరు పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. GSL తన అధికారిక వెబ్‌సైట్‌లో వివరాల నోటిఫికేషన్‌ను అప్‌లోడ్ చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో https://goashipyard.in లో 27 మార్చి 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లేదా పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ (PBT) ద్వారా నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు. అప్లికేషన్ ఫీజు రూ. 200. ఎస్బీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఈ -చెల్లింపు (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా). భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, SC/ ST/ PWBD/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఈ విధంగా అప్లై చేయండి..
1. అభ్యర్థులు ముందుగా goashipyard.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. హోమ్‌పేజీలో GSL రిక్రూట్‌మెంట్ 2024 కోసం లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయాలి.
3. ఇక్కడ అవసరమైన వివరాలను నింపాలి. ఒకసారి అన్ని వివరాలను చెక్ చేసి ఫారమ్‌ను సమర్పించాలి.
4. తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
5. ఇప్పుడు పూర్తి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.