TSRTC: కారుణ్య నియామకాలకు టీఎస్‌ఆర్టీసీ గ్రీన్‌ సిగ్నల్‌

TSRTC: కారుణ్యనియామకాల కింద 813 మందిని.. కండక్టర్లుగా తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు

Update: 2024-01-11 02:47 GMT

TSRTC: కారుణ్య నియామకాలకు టీఎస్‌ఆర్టీసీ గ్రీన్‌ సిగ్నల్‌

TSRTC: టీఎస్ ఆర్టీసీలో విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పది సంవత్సరాలుగా కారుణ్యనియామకాల కోసం చూస్తున్న వారి నిరీక్షణకు తెరదించింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్లర్లుగా తీసుకోవడానికి రంగం సిద్దం చేసింది. వీరందరికి శిక్షణనిచ్చిన తర్వాత కండక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తారు.

పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం చూస్తున్న ఆర్టీసీలోని ఉద్యోగుల కుటుంబసభ్యులకు శుభవార్త. కారుణ్యనియామకాలు, మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్ కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కారుణ్య నియామకాలకు సంబంధించి గత కొన్నేళ్ళుగా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కారుణ్య నియామకాలపై స్పష్టత రాలేదు. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన, విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు.. ఇప్పటికే రీజియన్ల వారిగా లిస్ట్ రెడీ చేసారు. కారుణ్య నియామకాల్లో భాగంగా మూడేళ్ల పాటు కన్సాలిడేటెడ్‌ పే ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. కన్సాలిడేటెడ్‌ పే కింద నియమితులయ్యే కండక్టర్లకు మూడేళ్ల పాటు నెలకు .17వేలు, డ్రైవర్లకు రూ.19 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు.

కారుణ్య నియామకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఎంపిక చేసిన సుమారు 200 మందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కానీ నియామకం చేపట్టలేదు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. ఇప్పుడు మరో 813 మందిని రిక్రూట్ చేసుకోనున్నారు..రీజియన్ల వారిగా చూస్తే సికింద్రాబాద్ రీజియన్ లో 126 మంది, హైదరాబాద్ పరిధిలో 66 మంది, రంగారెడ్డి రీజియన్ లో 52 మంది, వరంగల్ రీజియన్ లో 99 మంది ,ఖమ్మం నుంచి 53 మంది , ఆదిలాబాద్ 71 మంది, నిజామాబాద్ 69 , కరీంనగర్ 45, మెదక్ 93, మహబూబ్ నగర్ 83 మంది, నల్గొండ నుంచి 56 మంది ద్వారా ఈ పోస్టుల భర్తీ చేయనున్నారు.

మొత్తానికి కారుణ్య నియామకాల పట్ల కార్మిక సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాని వీటిని రెగ్యులరైజ్ బేస్ లో తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Tags:    

Similar News