Career Tips For Girls: కెరీర్‌ నిర్ణయాలలో అమ్మాయిలు ఈ విషయాలను విస్మరిస్తారు.. తర్వాత బాధపడుతారు..!

Career Tips For Girls: కెరీర్‌లో ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకునే నిర్ణయం వారి జీవితంలో చాలా ముఖ్యమైంది.

Update: 2023-11-06 12:30 GMT

Career Tips For Girls: కెరీర్‌ నిర్ణయాలలో అమ్మాయిలు ఈ విషయాలను విస్మరిస్తారు.. తర్వాత బాధపడుతారు..!

Career Tips For Girls: కెరీర్‌లో ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకునే నిర్ణయం వారి జీవితంలో చాలా ముఖ్యమైంది. అమ్మాయిలు కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యమైన విషయాలను విస్మరించడం వల్ల తర్వాత చాలా బాధపడుతారు. ఫలితం ఏంటంటే కొన్నాళ్లు పనిచేసిన తర్వాత ఈ రంగానికి మనం సూట్‌ కామనే ఉద్దేశ్యానికి వస్తారు. తర్వాత వారు చేసిన తప్పు ఏంటో తెలిసివస్తుంది. చాలామంది అమ్మాయిలు కెరీర్‌ విషయంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు. కానీ వారి సొంత నిర్ణయాన్ని మరిచిపోతారు.

ఇలాంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపం తప్ప మరేది మిగలదు. చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేకపోయినా అదే రంగంలో కొనసాగుతూ వస్తారు. కానీ దీని వల్ల పనిలో ఆనందం ఉండదు. మీకు అలా జరగకూడదని కోరుకుంటే కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాల గురించి తెలుసుకుందాం. ఎవరి కోసం ఎదురుచూడకుండా ముందుగా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించండి. సంతోషంగా ఉండే రంగాన్ని ఎంచుకోండి. దీని కోసం మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం.

ఫీల్డ్ ను అర్థం చేసుకోండి

ప్రతి ఫీల్డ్ భిన్నంగా ఉంటుంది. మీరు ఆ ఫీల్డ్ కు సెట్‌ అవుతారా లేదా చెక్‌ చేసుకోండి. ఉదాహరణకు కొన్ని ఫీల్డ్‌లో రాత్రిపూట పని చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు చాలా ప్రయాణం చేయాల్సి రావచ్చు. కాబట్టి ముందుగా దీని గురించి ఆలోచించి మీ అవసరాలు, కెరీర్‌ను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు కొనసాగండి.

కెరీర్ కౌన్సెలర్ సహాయం తీసుకోండి

ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్స్‌ ఉంటున్నాయి. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ పరిస్థితిలో మీరు ఏ రంగాన్ని ఎంచుకోవాలో అర్థం చేసుకోలేకపోతే నిపుణుల సహాయం తీసుకోవచ్చు. కెరీర్ కౌన్సెలర్ మీ ఆసక్తి, అవసరాలు, మార్కుల ఆధారంగా మీకు మెరుగైన సలహా ఇస్తారు. దీని తర్వాత మీరు ఫీల్డ్‌ను ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది.

కొత్త సవాళ్లు

మనం రోజూ ఒకే పని చేసినప్పుడు కొన్ని రోజులకు విసుగు వస్తుంది. అలాంటప్పుడు మనం వేరే రంగాన్ని ఎంచుకుంటే బాగుండునుకుంటాం. కాబట్టి ప్రతిరోజూ ఏదైనా కొత్తది చేయడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని చేయలేకపోతే సొంతంగా మీరే ఏదైనా ఉపాధిని క్రియేట్‌ చేసుకోండి. అందులో ఆసక్తిని చూపించండి. కచ్చితంగా విజయం సాధిస్తారు.

Tags:    

Similar News