Free Online Courses: హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఉచితంగా 5 ఆన్‌లైన్‌ కోర్సులు.. ఇలా అడ్మిషన్‌ తీసుకోండి..!

Free Online Courses: ఖాళీగా ఉన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని ఉచిత ఆన్‌లైన్ కోర్సులు చేయవచ్చు.

Update: 2023-10-31 13:30 GMT

Free Online Courses: హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఉచితంగా 5 ఆన్‌లైన్‌ కోర్సులు.. ఇలా అడ్మిషన్‌ తీసుకోండి..!

Free Online Courses: ఖాళీగా ఉన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని ఉచిత ఆన్‌లైన్ కోర్సులు చేయవచ్చు. అది కూడా అమెరికా అత్యున్నత యూనివర్సిటీ అయిన హార్వర్డ్ నుంచి. మీరు విన్నది నిజమే. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ విద్యా సంస్థలలో ఒకటి. ఇది QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో 4 స్థానంలో ఉంది. మీరు ఇంట్లో కూర్చొని ఈ విశ్వవిద్యాలయం నుంచి చదువుకునే అవకాశం పొందవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం అనేక ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందజేస్తోంది. విదేశీయులే కాదు భారతీయ విద్యార్థులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీ వెబ్‌సైట్ pll.harvard.edu ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

గేమ్ డెవలప్‌మెంట్ ఇంట్రడక్షన్

హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇంట్రడక్షన్ టు గేమ్ డెవలప్‌మెంట్ అనే ఉచిత కోర్సును అందిస్తోంది. గేమ్ డెవలప్‌మెంట్ బేసిక్‌ అంశాలు ఈ కోర్సులో వివరిస్తారు. ఇది మాత్రమే కాదు సృజనాత్మక వీడియో గేమ్‌లు, వాటిని తయారు చేయడంలో ఉపయోగించే పద్ధతులు, భావనలను తెలియజేస్తారు.

కంప్యూటర్ సైన్స్ ఇంట్రడక్షన్

కంప్యూటర్ సైన్స్ పరిచయం అనేది ఒక ఫౌండేషన్ కోర్సు. ఈ కోర్సులో హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బేసిక్‌ సూత్రాల గురించి సమాచారాన్ని అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ అల్గారిథమ్‌లు, సమస్య పరిష్కారం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల వంటి అంశాలను కవర్ చేస్తుంది.

ప్రైస్‌ స్ట్రాటజీ

కామర్స్ చదివే విద్యార్థులకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఎలా నిర్ణయిస్తాయో విద్యార్థులకు బోధిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో మార్కెట్ ట్రెండ్‌లు, ఉత్పత్తి వ్యయం, వినియోగదారు ప్రవర్తన వంటి అంశాలు ఉంటాయి.

ఆర్కిటెక్చర్‌ ఇంట్రడక్షన్

ఆర్కిటెక్చర్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరవచ్చు. ఇందులో ఆర్కిటెక్చర్ సూత్రాలు, డిజైన్ గురించి చెబుతారు. ఈ కోర్సులో చరిత్ర, సిద్ధాంతం, అభ్యాసం ఉంటాయి. ఈ కోర్సుతో విద్యార్థులు బిల్డింగ్ డిజైన్‌లోని సృజనాత్మక, సాంకేతిక అంశాలను అర్థం చేసుకోగలరు.

Tags:    

Similar News