Telangana: కౌన్సిలింగ్‌కు ముందే ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ షాక్

Telangana Engineering Colleges: విద్యా సంవత్సరం కౌన్సిలింగ్‌కు ముందు ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది.

Update: 2022-09-05 15:16 GMT

Telangana: కౌన్సిలింగ్‌కు ముందే ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ షాక్  

Telangana Engineering Colleges: విద్యా సంవత్సరం కౌన్సిలింగ్‌కు ముందు ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులు భారీ ఎత్తున పెరిగాయి. రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. దాదాపు 7 కాలేజీల్లో ఫీజు లక్షా 75వేలకుపైనే ఉంది. ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సిలింగ్ ప్రారంభించడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటివరకు 79 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా మరికొన్ని కాలేజీలు అదా బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను నిర్ణయిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ ఇచ్చింది.

Tags:    

Similar News