నిరుద్యోగులకి అలర్ట్.. టెక్నికల్ పోస్టులకి అప్లై చేశారా..!
DRDO Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (DRDO-CEPTAM)
DRDO Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (DRDO-CEPTAM) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్తులు drdo.gov.in అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ 23 సెప్టెంబర్ 2022. నోటిఫికేషన్‌కి సంబంధించి ఖాళీలు, అర్హతలు తదితర విషయాలు తెలుసుకుందాం.
జీతం వివరాలు
జీతం గురించి మాట్లాడితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు. అదే సమయంలో టెక్నీషియన్ A పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు లభిస్తుంది.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B అర్హత ప్రమాణాలు
అభ్యర్థి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లేదా అనుబంధ రంగాలలో డిప్లొమా కలిగి ఉండాలి.
టెక్నీషియన్ A కోసం అర్హత ప్రమాణాలు
అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI) నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక అనేక దశల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో అభ్యర్థులని షార్ట్‌లిస్ట్ చేయడానికి CBT పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదే సమయంలో మహిళలు, SC / ST / PwBD / ESM కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.