డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలు.. పది, ఇంటర్ మాత్రమే అర్హత..!
DRDO Recruitment 2022: పది,ఇంటర్ చదివిన నిరుద్యోగులు సులభంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం వచ్చింది.
DRDO Recruitment 2022: పది,ఇంటర్ చదివిన నిరుద్యోగులు సులభంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్.. 1061 స్టినోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఎ', స్టోర్ అసిస్టెంట్ 'ఎ', సెక్యూరిటీ అసిస్టెంట్ 'ఎ' వెహికల్ ఆపరేటర్ 'ఎ', ఫైర్ ఇంజన్ డ్రైవర్ 'ఎ', ఫైర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ నేర్చుకొని ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. అన్ని అర్హతలు ఉన్నవారు డిసెంబర్ 7, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 7 నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనరల్ అభ్యర్ధులు రూ.100లు ఫీజు కూడా చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్/మహిళా అభ్యర్ధులకు ఫీజు ఉండదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ క్యాపబులిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.19,000ల నుంచి రూ.1,12,400ల వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు అప్లై చేసేముందు ఒక్కసారి అధికారిక నోటిఫికేషన్ పరిశీలించాలి. మొత్తం ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.
1.జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (JTO) పోస్టులు: 33
2.స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I (ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు: 215
3.స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు: 123
4.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఎ' (ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు: 250
5.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఎ' (హిందీ టైపింగ్) పోస్టులు: 12
6.స్టోర్ అసిస్టెంట్ 'A' (ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు: 134
7.స్టోర్ అసిస్టెంట్ 'ఎ' (హిందీ టైపింగ్) పోస్టులు: 4
8.సెక్యూరిటీ అసిస్టెంట్ 'A' పోస్టులు: 41
8.వెహికల్ ఆపరేటర్ 'A' పోస్టులు: 145
9.ఫైర్ ఇంజన్ డ్రైవర్ 'A' పోస్టులు: 18
10.ఫైర్ మ్యాన్ పోస్టులు: 86