Abroad Study Plan: మీ పిల్లలు విదేశాల్లో చదవాలని కోరుకుంటున్నారా.. కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి..!
Abroad Study Plan: తల్లిదండ్రులకు పిల్లల గురించి చాలా కలలు ఉంటాయి. కొంతమందికి వారిని విదేశాల్లోచదివించాలని ఉంటుంది.
Abroad Study Plan: తల్లిదండ్రులకు పిల్లల గురించి చాలా కలలు ఉంటాయి. కొంతమందికి వారిని విదేశాల్లోచదివించాలని ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఇలాంటి సమయంలో చాలామంది బ్యాంకులపై ఆధారపడుతారు. ఇలా కాకుండా మీకు మీరే డబ్బును క్రియేట్ చేయవచ్చు. దీనికోసం ఒక ఆర్థిక ప్రణాళిక అవసరం. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
నేటి కాలంలో పిల్లలను విదేశాల్లో చదివించాలంటే దాదాపు రూ.40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రానున్న కాలంలో ఇది మరింత పెరగవచ్చు. ఈ ఖర్చు యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ వరకు మారుతూ ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి సరైన పెట్టుబడిని ప్రారంభిస్తే 20 సంవత్సరాల తర్వాత చాలా డబ్బు సమకూరుతుంది. మీ పిల్లలను విదేశాలకు పంపించి వారికి సాయపడగలరు.
మీరు ఈరోజు నుంచే SIPని (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించారని అనుకుందాం. నెలకు రూ.10,000 అంటే 20 ఏళ్లలో సగటున 12 శాతం రాబడి వస్తే దాదాపు రూ. 1 కోటి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో సగటు వార్షిక రాబడి సుమారు 15 శాతం ఉంటుంది. ఈ డబ్బుతో 15 శాతం లెక్కేస్తే దాదాపు రూ. 1.5 కోట్ల వరకు వస్తుంది. అంటే మీ బిడ్డ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మీ వద్ద రూ. 1.5 కోట్ల ఫండ్ ఉంటుంది. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి పెట్టుబడి ప్రణాళికను ప్రారంభించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే పిల్లలు ఉన్నత చదువులకు సిద్ధమైనప్పుడు డబ్బు సమస్య ఉండదు.