రైల్వేలో టీసీ, టీటీఈ గొప్ప ఉద్యోగాలు.. కానీ ఈ రెండు ఉద్యోగాల మధ్య తేడా తెలుసా..?

Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టీటీఈ వచ్చి టికెట్‌ చెక్‌ చేయడం తరచుగా మీరు చూసే ఉంటారు.

Update: 2023-03-19 04:30 GMT

రైల్వేలో టీసీ, టీటీఈ గొప్ప ఉద్యోగాలు.. కానీ ఈ రెండు ఉద్యోగాల మధ్య తేడా తెలుసా..?

Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టీటీఈ వచ్చి టికెట్‌ చెక్‌ చేయడం తరచుగా మీరు చూసే ఉంటారు. అలాగే కొన్నిసార్లు రైల్వేస్టేషన్‌లో రైలు దిగగానే ప్రధాన ద్వారం వద్ద కూడా టికెట్‌ తనిఖీ చేస్తారు. అయితే చాలామంది రైలులో టికెట్‌ చెక్‌ చేసేవారు ప్లాట్‌ఫాంపై టికెట్‌ తనిఖీ చేసేవారు ఒకేరకం ఉద్యోగులు అనుకుంటారు. కానీ ఈ ఇద్దరు వేర్వేరు. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యే నిరుద్యోగులు ఈ రెండు ఉద్యోగాల మధ్య తేడా తెలుసుకోవడం అవసరం.

ఇందులో ఒకరు TC (టికెట్ కలెక్టర్) మరొకరు TTE (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్). ఈ ఇద్దరి ఉద్యోగాలు, విధులు వేర్వేరుగా ఉంటాయి. వాస్తవానికి టీసీ, టీటీఈ ఇద్దరూ ప్రయాణీకుల టిక్కెట్‌లను తనిఖీ చేస్తారు. కానీ టీటీఈ రైలులో ప్రయాణించే ప్రయాణీకుల టిక్కెట్లను మాత్రమే తనిఖీ చేస్తారు. టీసీలు ప్లాట్‌ఫారమ్‌పై టికెట్లని తనిఖీ చేస్తారు. TC అంటే టిక్కెట్ కలెక్టర్. ఇతడు ప్లాట్‌ఫారమ్ లేదా గేటుపై నిలబడిన వ్యక్తులు, రైల్వే స్టేషన్‌కు వెళ్లే, వచ్చే వ్యక్తుల టిక్కెట్లను తనిఖీ చేస్తారు.

టీటీఈ అంటే ట్రైన్‌ టిక్కెట్ ఎగ్జామినర్. ఇతడు రైలులో ప్రయాణికుల టికెట్లని తనిఖీ చేయడం, వారి ఐడీ చెక్‌ చేయడం చేస్తారు. ఇది కాకుండా ఒక ప్రయాణీకుడికి సీటు లభించిందా లేదా చూస్తాడు. టిక్కెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులను పట్టుకుంటాడు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాడు. TTE పని రైలు ప్రయాణంలో ఉంటుందని గుర్తుంచుకోండి.

ఎంపిక ఎలా జరుగుతుంది?

టీటీఈ/టీసీ పోస్టులకు అభ్యర్థులు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకి ఉద్యోగం కేటాయిస్తారు. TTE/TC 5,200-20,200 + 1800 గ్రేడ్ పే స్కేల్‌లో జీతం చెల్లిస్తారు. ప్రారంభంలో బేసిక్ జీతం, అన్ని అలవెన్సులు కలిపి నెలకు రూ.36,000 వరకు పొందుతారు.

Tags:    

Similar News