నిరుద్యోగులకి అలర్ట్.. 7000 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.40,000 పైగా జీతం..!
Delhi Police Constable Recruitment 2023: పోలీస్ ఉద్యోగంలో చేరాలనే నిరుద్యోగ యువతకి ఇది ఒక మంచి అవకాశమని చెప్పాలి.
Delhi Police Constable Recruitment 2023: పోలీస్ ఉద్యోగంలో చేరాలనే నిరుద్యోగ యువతకి ఇది ఒక మంచి అవకాశమని చెప్పాలి. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 7 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఎస్‌ఎస్‌సి ఈ పోస్టుల భర్తీ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలు కూడా అయిపోయాయి. ఇందులో ఉద్యోగం రాదనుకునే వ్యక్తులకి ఈ నోటిఫికేషన్ సువర్ణవకాశమని చెప్పాలి. ఎంపికైతే చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడుతారు. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వయోపరిమితి
కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టుకు అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఢిల్లీ పోలీస్‌లో పనిచేస్తున్న లేదా రిటైర్మెంట్ అయిన లేదా మరణించిన పోలీసుల కుమారులు, కుమార్తెలకు మినహాయింపు ఉంటుంది. వీరు 11వ తరగతి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC-ST, మాజీ సైనికులు 100% మినహాయింపు పొందుతారు.
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌కు 7వ వేతన సంఘం ప్రకారం జీతం లభిస్తుంది. ఇది కాకుండా అనేక అలవెన్సులు, ప్రయోజనాలు పొందుతారు. ఢిల్లీ పోలీసుల ప్రారంభ జీతం రూ. 40,000 నుంచి రూ.43,000 మధ్య బేసిక్ పే రూ.21,700తో ఉంటుంది. ప్రారంభ వార్షిక వేతనం రూ.4.80 లక్షల నుంచి రూ.5.16 లక్షల వరకు ఉంటుంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జీతంలో HRA, DA, మెడికల్ మొదలైనవి ఉంటాయి.
దరఖాస్తు విధానం
1. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in పై క్లిక్ చేయండి .
2. హోమ్‌పేజీలో కనిపించే 'ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, స్త్రీల నోటీసు'పై క్లిక్ చేయండి.
3. మీ లాగిన్‌ని క్రియేట్ చేయండి. దాని వివరాలను ఎంటర్ చేయండి. తర్వాత ఓకె బటన్‌పై క్లిక్ చేయండి.
4. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
6. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించండి. ఫారమ్‌ను సమర్పించండి.
7. తర్వాత పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ ఔట్ కూడా తీసుకుని దగ్గర ఉంచుకోండి.